సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి వెల్లడించారు. కరోనా వల్ల పటిష్టమైన జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించబోతున్నామని ఆమె తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా పాలనాధికారి పేర్కొన్నారు.
తుదిదశకు దుబ్బాక ఉపఎన్నిక ఏర్పాట్లు : కలెక్టర్ - జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి స్పష్టం చేశారు. కరోనా ప్రభావంతో అన్ని జాగ్రత్తలతో ఎన్నికలను నిర్వహించనున్నామని ఆమె తెలిపారు.
తుదిదశకు దుబ్బాక ఉపఎన్నిక ఏర్పాట్లు : కలెక్టర్
ఓటు హక్కు అనేది మనందరి బాధ్యత ప్రతిఒక్కరు ఓటును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు దాదాపు తుదిదశలో ఉన్నాయని వివరించారు. ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని భారతి హోళికేరి వెల్లడించారు.