తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి తెరాస శ్రేణుల పాలాభిషేకం - సీఎం కేసీఆర్ చిత్ర పటానికి తెరాస శ్రేణుల పాలాభిషేకం

కరోనా సమయంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ... రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేయడంపై సిద్దిపేట జిల్లా దుబ్బాక తెరాస శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

trs activiss palabhiskeham to cm kcr
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి తెరాస శ్రేణుల పాలాభిషేకం

By

Published : May 9, 2020, 4:20 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి తెరాస నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. రైతులకు 25 వేల రుణమాఫీని తక్షణమే అమలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేయడం చూస్తుంటేనే... కేసీఆర్ రైతు పక్షపాతి అని అర్థమవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ, మండల తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details