తెలంగాణ

telangana

ETV Bharat / state

మానసిక వికలాంగులను ఆదుకుంటాం: ఆర్టీఓ - Government help the mentally retarded in Siddipeta district

మానసిక వికలాంగులైన అక్క, తమ్ముడిని ఆదుకుంటామని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీఓ అనంతరెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు.

Dubbaka RDO Antha reddy helps poor peoples in Siddipeta district
మానసిక వికలాంగులను ఆదుకుంటాం

By

Published : Jul 6, 2020, 5:43 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న మానసిక వికలాంగులైన అక్క, తమ్ముడిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారి తండ్రి అమ్మన లక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.

వారి కుటుంబ ఆర్థికపరిస్థితి గురించి తెలుసుకున్న ఆర్టీఓ అనంత రెడ్డి ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్​ మట్ట మల్లారెడ్డి వారి దీన పరిస్థితిని చూసి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో దుబ్బాక తహసీల్దార్​, మున్సిపల్​ కమిషనర్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details