దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతను లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. తొగుట మండలం రాంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికలు పూర్తయ్యేంత వరకే ఉంటారని, తర్వాత కనిపించరన్నారు.
ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలి: హరీశ్ రావు - దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు
దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో అధికార తెరాస పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, శివసేన జిల్లా నాయకుడు హన్మంతరెడ్డి తదితరులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
![ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలి: హరీశ్ రావు Dubbaka Opposition leaders joined the TRS party in the presence of Minister Harish Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9179723-857-9179723-1602734939825.jpg)
ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలి: హరీశ్ రావు
అంతకుముందు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, తొగుట మాజీ సర్పంచి పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, శివసేన జిల్లా నాయకుడు హన్మంతరెడ్డి, తదితరులు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ లత తదితరులు పాల్గొన్నారు.