వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రజలందరికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలోని మోహిన్‌పురా ఆలయంలో వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించున్నారు.
సిద్దిపేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే - రఘునందన్ రావు తాజా
కరోనా మహమ్మారి రెండోదశ భారత దేశంలోకి రాకుండా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భగవంతున్ని ప్రార్థించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సిద్దిపేటలోని మోహిన్‌పురాలోని వెంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.
సిద్దిపేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే
దేవుడి ఆశీస్సులతో కరోనా మహమ్మారి రెండోదశ భారత దేశంలోకి రాకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని రఘునందన్ రావు తెలిపారు. నరేంద్ర మోదీ ఆశీస్సులతో వాజ్‌పేయీ జన్మదినం పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ గుడ్ గవర్నెన్స్ అందాలని ఆకాంక్షించారు.
Last Updated : Dec 25, 2020, 2:20 PM IST