సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో అభివృద్ధి పనులకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శంకుస్థాపన చేశారు. 28 లక్షల వ్యయంతో మురికి కాలువల నిర్మాణం చేపట్టనున్నారు.
మురికి కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - మురికి కాలువల నిర్మాణానికి దుబ్బాక ఎమ్మెల్యే శంకుస్థాపన
కరోనా సమయంలో కూడా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మల్లుపల్లిలో రూ. 28 లక్షల ఖర్చుతో మురికి కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. వైరస్ విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
మురికి కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
కరోనా సమయంలో కూడా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ లక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ బక్కి వెంకయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి:జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!