తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ తప్పుడు నిర్ణయాలతోనే ప్రజల అవస్థలు' - hyderabad news

రిజిస్ట్రేషన్లపై ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి నష్టం చేకూరిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆరోపించారు. గవర్నర్​ను కలిసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరును తమిళిసై దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎల్​ఆర్​ఎస్​పై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైన నేపథ్యంలో..తనంతట తానే మారే ఒక పద్ధతిని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎంచుకున్నట్లు కనబడుతోందని అభిప్రాయపడ్డారు.

raghunandhan raoraghunandhan rao
తనంతట తానే మారిన ముఖ్యమంత్రి: రఘునందన్​రావు

By

Published : Dec 29, 2020, 10:50 PM IST

సిద్దిపేట జిల్లాలో ప్రోటోకాల్​, అధికారుల నియమ నిబంధనల ఉల్లంఘనలను గవర్నర్​ దృష్టికి తీసుకొచ్చినట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. తమిళిసైతో భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తప్పుడు నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలు అవస్థలు పడ్డారని రఘునందన్​రావు ఆరోపించారు. రిజిస్ట్రేషన్​ వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు.

ఈ మధ్యకాలంలో సిద్దిపేట జిల్లాలో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్​ పాటించని విషయాన్ని గవర్నర్​ తమిళిసై దృష్టికి తీసుకువచ్చాను. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను గవర్నర్​ వద్ద ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పనితీరుపై తన అభ్యంతరాలను తమిళిసై దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాం. అధికారులు.. అందరినీ సమాన దృష్టితో చూడాలని కోరుకుంటున్నాం. నా ఎన్నిక తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై చర్చించాం. సీఎం నిర్ణయాలన్నీ తొందరపాటు, అనాలోచిత, అప్రజాస్వామిక నిర్ణయాలు. చాలా కాలం తర్వాత ప్రజల నుంచి నిరసన వ్యక్తమైన నేపథ్యంలో తనంతట తానే మారే ఒక పద్ధతిని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎంచుకున్నట్లు కనబడుతోంది. అన్ని ప్రతిపక్షాలు ఎల్​ఆర్​ఎస్​ అంశంలో అభ్యంతరం వ్యక్తం చేస్తే అప్పట్లో మొండిగా వ్యవహరించారు. నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి నష్టం చేకూర్చారు.

-రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

తనంతట తానే మారిన ముఖ్యమంత్రి: రఘునందన్​రావు

ఇవీచూడండి:వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details