దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటం వల్ల కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తోంది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, కోనాపూర్, శేరిపల్లి బందారం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రచారాన్ని నిర్వహించారు.
నా తండ్రిలాగే అభివృద్ధి చేస్తాను: శ్రీనివాస్ రెడ్డి - దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం వార్తలు
దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్నందున నాయకులు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. దౌల్తాబాద్ మండలంలో పర్యటించారు. పేదవారు చదువులో రాణించాలనే ఉద్దేశంతో తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే, దివంగత చెరుకు ముత్యం రెడ్డి విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు.
![నా తండ్రిలాగే అభివృద్ధి చేస్తాను: శ్రీనివాస్ రెడ్డి నా తండ్రిలాగే అభివృద్ధి చేస్తాను: శ్రీనివాస్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9354687-thumbnail-3x2-sri.jpg)
నా తండ్రిలాగే అభివృద్ధి చేస్తాను: శ్రీనివాస్ రెడ్డి
పేదవారు చదువులో రాణించాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే, దివంగత చెరుకు ముత్యంరెడ్డి.. దుబ్బాక నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప తెరాస పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే తన తండ్రిలాగే తాను కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:దుబ్బాకలో తెరాస, భాజపా నాటకాలు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి