దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ), ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బందికి, కలెక్టర్ కార్యాలయంలో విధుల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. వీరికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, ఆర్డీఓ అనంత రెడ్డి అవగాహన కల్పించారు.
'ఉపఎన్నిక విధుల నిర్వహణపై దిశానిర్దేశం' - సిద్దిపేట కలెక్టరేట్ లో దుబ్బాక ఎన్నికపై భేటీ
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా విధులు నిర్వహించే బృందాలకు కలెక్టర్ వెంకట్రాంరెడ్డి అవగాహన కల్పించారు. టీమ్స్ నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు.

'ఉపఎన్నిక విధుల నిర్వహణపై దిశానిర్దేశం'
ఉపఎన్నిక సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) 7 టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ 7 టీమ్స్ ను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్రాంరెడ్డి ఏర్పాటు చేశారు. మండలానికి రెండు టీమ్స్ చొప్పున ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- డిజిటల్ లైసెన్సు ఉంటే చాలు