తెలంగాణ

telangana

ETV Bharat / state

పైసలు సంపాందించడమే హరీశ్​రావు పని: ధర్మపురి అరవింద్ - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

దుబ్బాక ఉపఎన్నికపై రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఉపఎన్నిక కాస్త భాజపా వర్సెస్ తెరాసగా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావుతో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

Dubbaka election compaign by BJP MP dhramapuri Aravind
పైసలు సంపాందించడమే హరీశ్​రావు పని: ధర్మపురి అరవింద్

By

Published : Oct 28, 2020, 7:58 PM IST

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెరాస నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా దుబ్బాక అభ్యర్థి రఘునందన్​రావుతో కలిసి సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

హరీశ్ రావు సీఎం దగ్గర గుమాస్తా మాత్రమేనని, మామను చూసి పైసలు సంపాందించడమే ఆయన పని అరవింద్ విమర్శించారు. కేసీఆర్​కు డప్పు కొట్టుకుంటూ తిరగడమే కేటీఆర్, హరీశ్​రావు చేసే పని అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్​ని అరెస్ట్ చేసిన జోయల్​ డేవిస్​ను ఉద్దేశించి ఒక ఎంపీ అంటే ఏమిటో తెలుసుకోవాలన్నారు.

రైతులు ధర్నాలు చేస్తేనే కేసీఆర్ మక్కలు కొంటామంటారని, రైతులందరు అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు. 2009 వరకు కేటీఆర్ ఎవరికీ తెలియదని, సంతోష్​రావు ఎవరో కూడ తెలవదన్నారు. వరిధాన్యం పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేస్తుందని రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సరోజ్​ కుమార్​ ఠాకూర్​ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: బండి

ABOUT THE AUTHOR

...view details