నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక - మెదక్ వార్తలు
నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక
11:16 September 29
నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక
దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్.. 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబరు 9న నోటిఫికేషన్ విడుదల కానుంది.
నామినేషన్ల దాఖలుకు అక్టోబరు 16 తుదిగడువు. నామపత్రాల ఉపసంహరణకు అక్టోబరు 19తో గడువు ముగుస్తుంది. దుబ్బాకతో పాటు దేశంలో 54 అసెంబ్లీ, ఒక ఎంపీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Last Updated : Sep 29, 2020, 2:44 PM IST