అభివృద్ధి, సంక్షేమం తెరాసతోనే సాధ్యమంటూ మంత్రి హరీశ్‌రావు మరోసారి తమ పార్టీకి ఘన విజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరుతున్నారు. లక్ష ఓట్ల ఆధిక్యాన్ని అందివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకే అభ్యర్థినిగా అవకాశం దక్కుతుందని భావిస్తున్నా... అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మండలాలు, గ్రామాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ తదితర కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేశారు. భాజపా నుంచి రఘునందన్‌రావు బరిలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే మండలాల వారీగా ఆ పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వారితో సమన్వయ సమావేశమూ నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మండలాల వారీగా సమావేశాలను పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మాజీ మంత్రి, దివంగత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు. తెరాస నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు.
ఉప సమరానికి మోగిన నగారా... హోరెత్తనున్న దుబ్బాక ఎన్నిక - dubbaka by elections updates
దుబ్బాక శాసననసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు తెరలేచింది. షెడ్యూలు ప్రకటిస్తూ తాజాగా మంగళవారం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబరు 3న పోలింగ్ జరగనుంది. షెడ్యూలు ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. ఇకపై మరింత దూకుడు పెంచనున్నాయి.
dubbaka by elections updates
తొలి ఉపఎన్నిక..
2008లో నియోజకవర్గాల పునర్విభజనతో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. 2009, 2014, 2018లలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న కన్నుమూశారు. దీంతో తొలిసారి ఇక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.