సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుబ్బాక మున్సిపాలిటీలోని నాలుగో వార్డులోని దుంపలపల్లిలో సుమారు గంటసేపు ఈవీఎం మొరాయించడం వల్ల కొంత మంది ఓటర్లు వెనక్కి తిరిగిపోయారు.
దుబ్బాక ఉపఎన్నికలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు - Dubbaka by-election polling
దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గంటసేపు ఈవీఎం మొరాయించడం వల్ల కొంత మంది ఓటర్లు వెనక్కి తిరిగిపోయారు. మరికొంత మంది కేంద్రంలోనే పడిగాపులు కాశారు.
ప్రశాంతంగా దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్
దుబ్బాక మండలం రామక్కపేట, ఏనుగుర్తి గ్రామంలో అరగంట సేపు ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు అవస్థ పడ్డారు. వృద్ధులు ఎక్కడివాళ్లు అక్కడే కూర్చుండిపోయారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.