దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియ... సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం లక్ష 98 వేల 807 మంది ఓటర్లుండగా... వారిలో లక్ష 779 మంది మహిళా ఓటర్లు, 98 వేల 28 పురుషులు ఉన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. ఉదయం 7 గంటలకు పోలింగ్ - Dubaka latest news
రేపటి దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించనున్నారు.
ఉపఎన్నికకు మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి బూత్‌లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఓటరుకూ చేతి తొడుగులు ఇవ్వడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో పీపీఈ కిట్లతో వచ్చి ఓటువేసే అవకాశం కల్పించారు. ఓటరుకు ఓటరుకు మధ్య 5 మీటర్ల భౌతిక దూరం, వీల్‌ఛైర్లు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటుచేస్తున్నారు.
ఇవీ చూడండి: దుబ్బాకలో ముగిసిన ప్రచార పర్వం.. ఈనెల 3న పోలింగ్