దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేంద్రాల వద్ద అధికారులు కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నారు. మాస్కులు ఉంటేనే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు శానిటైజ్ చేసుకున్న తర్వాతే ఓటు వేసేందుకు ఓటర్లను పంపిస్తున్నారు.
ప్రశాంతంగా కొనసాగుతోన్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ - దుబ్బాక ఉపఎన్నికలు
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా కొనసాగుతోన్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఆయా పార్టీల కార్యకర్తలు నమూనా బ్యాలెట్ చూపిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవీ చూడండి: చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్‌రావు