తెలంగాణ

telangana

ETV Bharat / state

వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర, క్లీనర్.. రక్షించిన గ్రామస్థులు - pilli vagu in siddipet district

లారీలతో సహా డ్రైవర్, క్లీనర్​ వాగులో చిక్కుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి పిల్లివాగులో చోటుచేసుకుంది. గమనించిన గ్రామస్థులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు.

driver stucked in pilli vagu
వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర, క్లీనర్

By

Published : Sep 27, 2020, 12:48 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి పిల్లి వాగులో శనివారం అర్ధరాత్రి సమయంలో రెండు లారీలతో సహా డ్రైవర్, క్లీనర్ చిక్కుకున్నారు. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో తంగళ్లపల్లి గ్రామస్థుడు జాలిగం నరేశ్ వారిని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. వాగు వద్దకు చేరుకున్న గ్రామస్థులు తాడు సాయంతో వారిని కాపాడారు.

వాగులో చిక్కుకున్న వారిని.. డ్రైవర్ గోదావరిఖనికి చెందిన నరేశ్, క్లీనర్ కాసాల తిరుపతిగా గుర్తించారు. చీకట్లో వాగు ఉద్ధృతి గమనించక వచ్చామని వారు చెప్పారు. ఈ సంఘటనలో ఎవరికి ప్రమాదం జరగపోవడం వల్ల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలుపణంగా పెట్టి తమను కాపాడిన గ్రామస్థులకు డ్రైవర్, క్లీనర్​లు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details