తెలంగాణ

telangana

ETV Bharat / state

'తాగు నీటి సమస్యలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు'

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం జ్యోతిరామ్ తండావాసులు తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మంచినీటి ట్యాంక్ వాల్వు పాడై వారం రోజులైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వారం దాటినా మరమ్మతులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

drinking water problems at jyothi ram thanda, siddipet district
తాగునీటి సమస్యలు, సిద్దిపేట జిల్లా వార్తలు

By

Published : Apr 30, 2021, 3:13 PM IST

వేసవి తాపంతో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. తాగునీటి సౌకర్యాలు ఉన్నా ప్రజలకు అందించలేక అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామ పరిధిలోని జ్యోతి రామ్ తండాలో తాగునీటి కోసం మిషన్ భగీరథ నీళ్ల ట్యాంక్​ను నిర్మించారు. నీటిని విడుదల చేసే గేటు వాల్వు వారంరోజుల కిందట చెడిపోగా... మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.

స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఈ విషయమై సంప్రదిస్తే సిబ్బందికి చెప్పానని అంటున్నారని, మూడు నెలలుగా తమకు జీతాలు లేవని సిబ్బంది అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంక్ పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని వాపోయారు. తమ తండాలో 20 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా బాధితుల కోసం ఐపీఎల్ జీతమిచ్చేసిన క్రికెటర్

ABOUT THE AUTHOR

...view details