సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి తెస్తున్న మంచినీటిని వృథా చేయవద్దని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు. సిద్దిపేట 22, 23 వార్డుల్లో ఆయన పర్యటించారు. తడి, పొడిచెత్త బుట్టలతో పాటు జనపనార సంచులను పంపిణీ చేశారు.
మంచినీటిని వృథా చేయొద్దు : హరీశ్‌రావు
ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట పట్టణంలో తడి, పొడి చెత్త కోసం 38 వేల చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు. సిద్దిపేట పట్టణంలో 22, 23వార్డుల్లో పర్యటించి పలువురికి జనపనార సంచులను పంపిణీ చేశారు.
మంచినీటిని వృథా చేయొద్దు : హరీశ్‌రావు
ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి... ఆరోగ్యం కంటే విలువైనది ఏదీ లేదని పేర్కొన్నారు. జిల్లావాసుల సహకారంతో సిద్దిపేటను ఆరోగ్య సిద్దిపేటగా మార్చుకుందామని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరికి లంచం ఇవ్వవద్దని సూచించారు.
ఇదీ చూడండి : కామారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య