తెలంగాణ

telangana

ETV Bharat / state

నిఘా నేత్రాల ఏర్పాటుకు రూ.50వేల రూపాయల విరాళం - బొమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి

హుస్నాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నిఘా నేత్రాల ఏర్పాటు కోసం బొమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి రూ.50వేల విరాళాన్ని ఇచ్చారు. నిఘా నేత్రాల ఏర్పాటు వల్ల పట్టణ ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరుకున్నారు.

Donation of Rs. 50,000 for setting up of surveillance eyes
Donation of Rs. 50,000 for setting up of surveillance eyes

By

Published : Apr 24, 2021, 6:29 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నిఘా నేత్రాల ఏర్పాటు కోసం బొమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి రూ.50,000 స్థానిక సీఐ రఘు, ఎస్ఐ శ్రీధర్​లకు అందించారు. ప్రజల శాంతి, భద్రతల కొరకు ఏర్పాటు చేస్తున్న నిఘా నేత్రాల కోసం తమ వంతు బాధ్యతగా రూ.50 వేల విరాళాన్ని అందించినట్లు పేర్కొన్నారు.

వీటి ఏర్పాటు వల్ల పట్టణ ప్రజలు శాంతియుతంగా, భద్రతగా జీవించాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఉపయోగ కార్యక్రమాలకు సమాజంలోని పెద్దలు కూడా కలిసి రావాలన్నారు.

ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details