తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస నాయకులకు నిబంధనలు వర్తించవా: డీకే అరుణ

దుబ్బాక ఉపఎన్నికలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భాజపా నాయకురాలు డీకే అరుణ కోరారు.

తెరాస నాయకులకు నిబంధనలు వర్తించవా: డీకే అరుణ
తెరాస నాయకులకు నిబంధనలు వర్తించవా: డీకే అరుణ

By

Published : Nov 3, 2020, 4:57 AM IST

తెరాస నాయకులు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తుంటే అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నీతి వాక్యాలు పలికిన మంత్రి కేటీఆర్​కు ఇప్పుడు నోరు లేదా అంటూ విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నికలో గెలిచేందుకు ఏ స్థాయి కన్నా దిగజారుతారా అని మండిపడ్డారు.

తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో భాజపా కార్యకర్తలు అక్కడికి వెళ్లారని ఆమె తెలిపారు. సిద్దిపేట జిల్లాకు సంబంధం లేని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు, జిల్లా పోలీసులు ఎందుకు స్పందించడం లేదన్నారు. తెరాస నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అని నిలదీశారు.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెరాస నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి యత్నించిన భాజపా కార్యకర్తలు

ABOUT THE AUTHOR

...view details