తెలంగాణ

telangana

ETV Bharat / state

'దివ్య ఎవరికి దక్కకూడదనే చంపేశాడు' - undefined

Divya murder case latest news
Divya murder case latest news

By

Published : Feb 20, 2020, 5:14 PM IST

Updated : Feb 20, 2020, 8:00 PM IST

15:49 February 20

దివ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు

దివ్య హత్య కేసు నిందితుడికి వైద్య పరీక్షలు పూర్తి...కోర్టుకు తరలింపు

       గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. నిన్న రాత్రి వేములవాడలో నిందితుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నారాయణ తెలిపారు. దివ్యను హత్య చేసినట్లు వెంకటేశ్‌ ఒప్పుకున్నాడని చెప్పారు. వెంకటేశ్‌, దివ్య పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందన్నారు.

       బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి దివ్య తనను దూరం పెడుతుండటంతో వెంకటేశ్‌ కక్ష పెంచుకున్నాడని ఏసీపీ తెలిపారు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదని వెంకటేశ్‌ నిర్ణయించుకుని... ఈనెల 18న దివ్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి వెంకటేశ్‌ దాడి చేశాడని  పేర్కొన్నారు. నిందితుడికి వైద్య పరీక్షల అనంతరం... కోర్టుకు తరిలించినట్లు  ఏసీపీ తెలిపారు.

Last Updated : Feb 20, 2020, 8:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details