తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఉపాధ్యాయుల కృషి.. 1,2 తరగతుల విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాలు

1, 2 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు సిద్దిపేట జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. దానికోసం తమ వద్ద ఉన్న చరవాణీల్లోనే ప్రత్యేకమైన వీడియో పాఠాలు చిత్రీకరించి, ఆకర్షణీయమైన బొమ్మలు, ఆటలు, పాటలతో పాఠాలను రూపొందించి స్థానిక కేబుల్​ టీవీ ద్వారా పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. వారి కృషికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

digital classes for 1,2 classes students in siddipet district
ఆ ఉపాధ్యాయుల కృషి.. 1,2 తరగతుల విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాలు

By

Published : Nov 15, 2020, 1:11 PM IST

రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు 1, 2 తరగతుల విద్యార్థులకు కూడా ఆన్లైన్ పాఠాలు చెప్పాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంఈఓ అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఆయన హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులతో పర్చువల్ (జూమ్ మీటింగ్) నిర్వహించారు. సమావేశంలో 1, 2 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని 20 మంది విషయ నిపుణులను ఎంపిక చేశారు. పిల్లల అభ్యాసన సామర్థ్యాలకు తగినట్లుగా వారితో తెలుగు గణితం, ఆంగ్లం, సబ్జెక్టుల్లో ఒక్కో తరగతికి 30 నిమిషాల నిడివితో వీడియో పాటలు రూపొందించారు.

స్థానిక కేబుల్​ టీవీ ద్వారా..

ఆటలు, పాటలు, మాటలతో ఆకట్టుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. మొదట హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మూడు మండలాల్లోని విద్యార్థులకు మాత్రమే స్థానిక కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రసారం చేయాలనుకున్నారు. కానీ జిల్లా విద్యాధికారి రవి కాంతారావు ఆ పాఠాలను జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు. దానితో జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉన్న ఎస్​ఎస్​సీ ఛానల్ యాజమాన్యంతో చర్చించి అక్టోబర్ 19 నుంచి ఎస్ఎస్సీ కిడ్స్ ఛానల్లో మొదటి విడత ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. కాగా మరల ఇప్పుడు రెండో విడత ఆన్​లైన్​ పాఠాలను ప్రచారం చేస్తున్నారు.

విద్యా సంవత్సం వృథా కాకుండా..

జిల్లాలో 1150 ప్రాథమిక పాఠశాలలు, 230 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 8,284 మంది 1వ తరగతి, 11,773 మంది విద్యార్థులు 2వ తరగతి చదువుతున్నారు. టీవీలో డిజిటల్ పాఠాల ద్వారా దాదాపు 20 వేల మంది విద్యార్థులు జిల్లాలో ఆన్లైన్ తరగతులు ద్వారా విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఈ విధంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించడాన్ని అభినందించారు.

ఇదీ చూడండి:నిజామాబాద్​లో ఘనంగా బాలల దినోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details