తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్గల్​ సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు - దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

సిద్ధిపేట జిల్లా వర్గల్​ విద్యా సరస్వతి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా  అమ్మవారిని అందంగా అలంకరణ చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Devi Navaratri Celebrations in Wargal
వర్గల్​ సరస్వతి ఆలయంలో.. భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 24, 2020, 4:34 PM IST

సిద్ధిపేట జిల్లా వర్గల్​లోని విద్యా సరస్వతి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా అష్టోత్తర కలశ పూజ నిర్వహించారు.

కలశ పూజ అనంతరం అమ్మవారికి విశేష అభిషేకం చేయించారు. అనంతరం అమ్మవారి నిజరూపానికి మంగళహారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details