సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు శివారులోని బావిలో సోమవారం రాత్రి గల్లంతైన హైదరాబాద్కు చెందిన కుకట్ల నగేశ్(28) మృతదేహం లభ్యమైంది. మంగళవారం రోజంతా గజ ఈతగాళ్లతో గాలించినా దొరకలేదు. దీంతో బుధవారం మోటారు బిగించి నీటిని తోడించేందుకు ఎస్సై మోహన్ బాబు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ యువకుడి మృతదేహం లభ్యం - siddipet district
కరోనా కారణంగా బయట తిరగలేని పరిస్థితి. పల్లెటూళ్లలో ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని వచ్చిన యువకుడు ఊరుగాని ఊళ్లో కన్నవాళ్లకు కనపడకుండా పోయాడు. హైదరాబాద్కు చెందిన కుకట్ల నగేశ్ సోమవారం ఈత కోసం బావిలో దిగి గల్లంతయ్యాడు. మంగళవారం గజ ఈతగాళ్లతో ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. బుధవారం మృతదేహం నీటిపై తేలింది.
హైదరాబాద్ యువకుడి మృతదేహం లభ్యం
కాగా తెల్లవారుజామున బావిలో చూసే సరికి మృతదేహం నీటిపై తేలింది. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ స్వస్థలానికి తీసుకెళ్లారు.
ఇవీ చూడండి: సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడి గల్లంతు