సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఈనెల 31 వరకు ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటికి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ రంగనబోయిన రాములు ప్రజలకు డప్పు చాటింపుతో అవగాహన కల్పించారు.
డప్పు చాటింపుతో లాక్డౌన్ హెచ్చరిక - లాక్డౌన్ హెచ్చరిక
కరోనా మహమ్మారిపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రజలు బేఖాతరు చేస్తూ ఉండడం వల్ల సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో డప్పు చాటింపుతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
డప్పు చాటింపుతో లాక్డౌన్ హెచ్చరిక
ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కడైనా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ కనిపిస్తే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారని వీధివీధి తిరుగుతూ డప్ప చాటింపుతో తెలియజేస్తున్నారు. ప్రజలందరూ సర్కారు ఆదేశాలకు కట్టుబడి వైరస్ బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471