సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కల్తీ డీజిల్ విక్రయిస్తున్న బంకు ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. కల్తీ ఇంధనం వాడకం వల్ల తమ వాహనాలు రెండు నెలలకే పాడైపోయాయని రైతులు, వినియోగదారులు వాపోయారు. పట్టణంలోని ఇండిజెల్ పెట్రోల్ బంకులో ఈ కల్తీ బాగోతం బయటపడింది.
కల్తీ డీజిల్‌తో పాడైన వాహనాలు... వినియోగదారుల ఆందోళన
ప్రస్తుత సమాజంలో ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు ఏదో రూపంలో కల్తీ బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా తీసుకుని కల్తీ డీజిల్‌ను విక్రయించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఇండీజెల్ బంకు నిర్వాహకులు. ఈ విషయాన్ని గమనించిన వాహనదారులు బంకు ఎదుట ఆందోళనకు దిగారు.
కల్తీ డీజిల్‌తో పాడైన వాహనాలు..... వినియోగదారుల ఆందోళన
రెండు రూపాయలు తక్కువకు వస్తుందన్న కారణంతో ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు మోసపోయామని తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కల్తీ డీజిల్ విక్రయిస్తున్న దుకాణ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తహాసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య తెలిపారు.