నర్సరీలను పరిశీలించిన సీఎస్ కాళేశ్వరం నిర్మాణంలో నష్టపోతున్న అటవీ సంపదకు ప్రత్యామ్నాయంగా పెంచుతున్న నర్సరీలను సీఎస్ జోషి పరిశీలించారు. కాళేశ్వరం నిర్మాణంలో పోతున్న చెట్ల స్థానంలో... కొత్త మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. ప్రతిపాదిత ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణను క్షేత్రస్థాయిలో పర్యటించారు. ములుగుతో పాటు వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ నర్సరీలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ శాఖ యంత్రాంగం పనితీరుపై ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా ప్రధాన కార్యదర్శికి అటవీశాఖ అధికారులు వివరించారు.