తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ - మల్లన్న సాగర్ ప్రాజెక్టు

సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని  పలు గ్రామాల్లో పొలాలు నీటి ముంపునకు గురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ

By

Published : Oct 30, 2019, 8:18 PM IST

ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ
సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్, తొగుట శివారులోని పంట పొలాలు మొత్తం వరద నీటి ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగినందున గుత్తేదారులు గండి పెట్టారు. వరద నీరంతా కింద ఉన్న పంట పొలాలను మొత్తం ముంచేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద నీటిలో మునిగి పోవడం వల్ల రైతులు కన్నీరు మున్నీరయ్యారు.

స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇవాళ ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించారు. ఎంత పరిధిలో పంట నష్టం జరిగిందని తెలుసుకోవడానికి అధికారులను నియమించి.. దాని ప్రకారం రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details