సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో పుల్వామ ఘటనలో అమరులైన వీర జవాన్ల జ్ఞాపకార్థం గౌరవెల్లి గ్రామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ఎస్ఐ పాపయ్య నాయక్ ప్రారంభించారు. అమర జవాన్లను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
వీర జవాన్ల జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ - జవాన్ల జ్ఞాపకార్థం
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో గౌరవెల్లిలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. పుల్వామ ఘటనలో అమరులైన వీర జవాన్ల జ్ఞాపకార్థం ఈ పోటీలను జరుపుతున్నట్టు గౌరవెల్లి గ్రామ యూత్ అసోసియేషన్ సభ్యులు అన్నారు.
వీర జవాన్ల జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్
అనంతరం పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు సీఐ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా నైపుణ్యాలతో పాటు దేశభక్తిని పెంపొందించుకుని దేశ రక్షణలో యువకులు భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల పాటు 25 జట్లు ఈ టోర్నమెంట్లో పోటీ పడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి:వాతలు పెట్టి, తాళ్లతో బంధించి... నరకం చూపారు