'సీపీఎస్ రద్దుకు కమిటీని నియమించాలి' - 'సీపీఎస్ రద్దుకు కమిటీని నియమించాలి'
సీపీఎస్ రద్దుకు కమిటీని నియమించాలని, ఉమ్మడి జిల్లాకు ప్రామాణికంగా పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి డిమాండ్ చేశారు.
'సీపీఎస్ రద్దుకు కమిటీని నియమించాలి'
సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో పీఆర్టీయుటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఎమ్మెల్సీ విమర్శించారు. పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేశాయని... మరో ఐదు రాష్ట్రాలలో కమిటీలు వేశారని తెలిపారు. రాష్ట్రంలోనూ కమిటీని ఏర్పాటు చేసి సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
TAGGED:
DIKSHA