తెలంగాణ

telangana

ETV Bharat / state

సెప్టెంబర్​ 17న తెలంగాణ విలీన దినోత్సవం జరపాలి: తమ్మినేని - సిద్దిపేట జిల్లా వార్తలు

సెప్టెంబర్​ 17న తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు అణభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

cpm state president thammineni veerabadram tributes to anabheri prabhakar rao in siddipeta district
సెప్టెంబర్​ 17న తెలంగాణ విలీనం దినోత్సవం జరపాలి: తమ్మినేని

By

Published : Sep 15, 2020, 3:58 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు అణభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉన్నత చదువు, భవిష్యత్​ను వదులుకొని తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన మహనీయుడు అణభేరి ప్రభాకర్ రావు అని కొనియాడారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూస్వామ్య వ్యవస్థ లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు కానీ రాష్ట్రంలో భూములను తమ ఆధీనంలో ఉంచుకున్న లక్షల మంది భూస్వాములు ఉన్నారని ఆరోపించారు. ప్రశ్నించే నాయకులు, మేధావుల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్రంలో ఉన్న భాజపా మానుకోవాలన్నారు. అనంతరం మహ్మదాపూర్ గుట్టల్లో అమరులైన 12 మంది తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సమాధుల వద్ద నివాళులర్పించారు.

ఇదీ చదవండి:కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details