తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: చాడ

నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి డిమాండ్​ చేశారు. ఎముకలు కోరికే చలిలో 25 రోజులుగా దిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నా.. కేంద్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేటలో అన్నారు. సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లొచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

cpi state secretary chada venkat reddy on agriculture acts in siddipeta
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: చాడ

By

Published : Dec 23, 2020, 5:38 PM IST

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి విమర్శించారు. ఎముకలు కోరికే చలిలో 25 రోజులుగా దిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 33 మంది రైతులు మరణించారని చెప్పారు. కనీస మద్దతు ధర లేకుండా, మార్కెట్ కమిటీలు రద్దు చేస్తూ కేంద్రం కొన్ని తప్పిదాలు చేసిందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లొచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక రైతు బంద్ కొందరికి మాత్రమే ఇస్తోందన్నారు. నిరుద్యోగులకు రూ. 3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 28న కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు. సాగు చేసే వారికే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 4న కలెక్టరేట్ ముట్టడిస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి:మంత్రి సబితా డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్​కు గడువు కోరిన సీబీఐ

ABOUT THE AUTHOR

...view details