చిత్తం శివుడిపైన చూపు ప్రసాదంపైన ఇది మోదీ, కేసీఆర్, జగన్ అనుసరిస్తున్న విధానాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి, నారాయణ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని నారాయణ ఆరోపించారు.
'వారి విధానాలు చిత్తం శివుడిపై.. చూపు ప్రసాదంపై' - సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తాజా వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అనాభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి, నారాయణ సమావేశం నిర్వహించారు.

ప్రపంచంలోనే ఆస్తుల విషయంలో అంబానీ నాలుగో స్థానంలో నిలిస్తే... మనదేశం కరోనా విషయంలో రోజు వారి కేసుల విషయంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రాజ్యంగాన్ని ధ్వంసం చేస్తూ మత రాజకీయాల్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. దీనికి నిరసనగా ఆగస్టు 15న రాజ్యాంగాన్ని కాపాడాలని వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇటీవల మరణించిన సీపీఐ నాయకులు మాదన నారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు.
ఇదీ చూడండి :అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు