తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ నిర్వాసితులపై మేం లాఠీఛార్జ్​ చేయలేదు: సీపీ శ్వేతారెడ్డి - siddipet district latest news

CP SWETHA REDDY: గౌరవెల్లి భూ నిర్వాసితులపై తమ సిబ్బంది లాఠీఛార్జ్​ చేయలేదని సిద్దిపేట జిల్లా సీపీ శ్వేతారెడ్డి వెల్లడించారు. ఆత్మరక్షణ కోసమే ఆందోళనకారుల వద్ద ఉన్న వస్తువులను తీసుకున్నామని స్పష్టం చేశారు.

భూ నిర్వాసితులపై మేం లాఠీఛార్జ్​ చేయలేదు: సీపీ శ్వేతారెడ్డి
భూ నిర్వాసితులపై మేం లాఠీఛార్జ్​ చేయలేదు: సీపీ శ్వేతారెడ్డి

By

Published : Jun 14, 2022, 10:59 PM IST

భూ నిర్వాసితులపై మేం లాఠీఛార్జ్​ చేయలేదు: సీపీ శ్వేతారెడ్డి

CP SWETHA REDDY: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గౌరవెల్లి భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ అధికారికి గాయాలయ్యాయని సిద్దిపేట జిల్లా సీపీ శ్వేతారెడ్డి వెల్లడించారు. తమ సిబ్బంది ఎక్కడా బల ప్రయోగం, లాఠీఛార్జ్​ చేయలేదని స్పష్టం చేశారు. నిరసనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమ సిబ్బందిపై దాడికి యత్నించగా.. ఆత్మరక్షణ కోసం వారి దగ్గర ఉన్న వస్తువులను మాత్రమే తీసుకున్నామని తెలిపారు.

దీనిని కొందరు మీడియా వాళ్లు తప్పుగా చూపిస్తున్నారని.. పోలీసులే నిర్వాసితులపై దాడి చేసినట్లుగా చూపించడం తప్పని అన్నారు. హింసకు తావులేకుండా అత్యంత సంయమనంతో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. నిరసనకారులు శాంతియుతంగా ఉంటే తామూ శాంతియుతంగానే ఉంటామని అన్నారు. మరోవైపు నిర్వాసితులు తమ ధర్నాను విరమించారు. రేపు అదనపు కలెక్టర్​ వచ్చి చర్చలు జరుపుతారని సీపీ హామీ ఇవ్వడంతో శాంతించారు.

ఏం జరిగిందంటే..

గౌరవెల్లి భూనిర్వాసితులపై సోమవారం పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన హుస్నాబాద్ బంద్... తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు తమ గోడు పట్టడం లేదంటూ... ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.. క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, భూనిర్వాహితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలపై భూనిర్వాసితులు దాడికి దిగారు. కర్రలు, పైపులతో తెరాస నేతలు కూడా ఎదురుదాడి చేసుకున్నారు. ఘర్షణలో కొందరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఆందోళనలను అదుపు చేసేందుకు యత్నించిన హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్‌ఐ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. నిర్వాసితులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గుడాటిపల్లి నిర్వాసితులు పోలీస్​స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.

ఇవీ చూడండి..

హుస్నాబాద్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ప్రజాప్రతినిధులపై దాడి.. పోలీసుల లాఠీఛార్జ్‌

'భూ నిర్వాసితులపై దాడిని ఖండిస్తున్నాం.. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తాం'

ABOUT THE AUTHOR

...view details