తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తి కొనుగోలు చేయాలంటూ రైతుల రాస్తారోకో

సిద్దిపేట జిల్లా హున్నాబాద్​లో ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు జిన్నింగ్​ మిల్లులోని పత్తి కొనుగోలు చేయాలని రాస్తారోకో నిర్వహించారు.

cotton-farmers-protest-in-siddipet
పత్తిని కొనుగోలు చేయాలంటూ రైతుల రాస్తారోకో

By

Published : Dec 4, 2019, 2:51 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం పందిళ్లలోని జిన్నింగ్​ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని హుస్నాబాద్​ - సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు.

దీనితో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పత్తి కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.

పత్తి కొనుగోలు చేయాలంటూ రైతుల రాస్తారోకో

ఇదీ చూడండి: 'జాలర్ల వలలో పీఎస్‌ఎల్​వీ రాకెట్ బూస్టర్‌'

ABOUT THE AUTHOR

...view details