సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలిక పరిధిలోని కొల్లూర్‌లో.. భూ అక్రమాలకు తెరపడటం లేదు. అక్రమణదారుల నుంచి తాయిలాలు అందుకొని కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొల్లూరు శివారులోని సర్వే నెంబర్ 191లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు హద్దురాళ్లు తొలగించారు. వాటిని యథాస్థానంలో పెట్టాల్సిన అధికారులు.. మరో చోటకు మార్చి కబ్జాదారులకు సాయంచేశారు.
191 సర్వే నెంబర్ పక్కనే ఉన్న 205, 209 సర్వే నెంబర్లలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమి ఉంది. ప్రభుత్వ, పట్టాభూమికి మధ్యలో బండ్ల బాట ఉండేదని.. సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పంటలకోత సమయంలో పూజలు చేసే వాళ్లమని స్థానిక రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడకట్టడంతో గుడికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో సంతృప్తి చెందని భూఆక్రమణదారుడు పట్టాలో ఉన్నమొత్తం కంటే విస్తీర్ణం తక్కువగా ఉందని.. తన భూమి హద్దులు చూపించాలంటూ.. సంగారెడ్డి జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ విషయంపై సర్వేచేసిన అధికారులు.. ప్రభుత్వ భూమిని కలిపి ఆక్రమణదారుడికి మద్దతుగా హద్దు రాళ్లు పాతినట్లు గుర్తించారు.
వెంకటేశం కొల్లూరు వాసి