తెలంగాణ

telangana

ETV Bharat / state

చెత్త ట్రాక్టర్​లో కరోనా యోధుల తరలింపు.. కార్మికుల ఆందోళన - గజ్వేల్​లో కరోనా యోధుల నిరసన వార్తలు

corona-warriors-transported-in-municipality-garbage-tractors
చెత్త ట్రాక్టర్​లో కరోనా యోధుల తరలింపు.. కార్మికుల ఆందోళన

By

Published : Aug 23, 2020, 11:13 AM IST

Updated : Aug 23, 2020, 1:02 PM IST

11:10 August 23

చెత్త ట్రాక్టర్​లో కరోనా యోధుల తరలింపు.. కార్మికుల ఆందోళన

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘంలో పని చేస్తున్న 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం అధికారులు బాధితులను మున్సిపాలిటీకి చెందిన చెత్త ట్రాక్టర్​లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తోటి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

కార్మికులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి సంఘీభావం తెలిపాడు. అధికారుల తీరును తప్పుబట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న కమిషనర్​ కార్మికులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫలితంగా కార్మికులు ఆందోళన విరమించారు.

ఇదీచూడండి: శాంతిస్తోన్న గోదారి: రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

Last Updated : Aug 23, 2020, 1:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details