తెలంగాణ

telangana

ETV Bharat / state

'అర్హులైన అందరికీ టీకాలు అందిస్తున్నాం'

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హులైన అందరికీ టీకాలు అందిస్తున్నామని కోహెడ మండల వైద్యాధికారి విజయరావు తెలిపారు. టీకా తీసుకున్న సరే అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. టీకా తీసుకున్నామనే నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.

corona vaccination center at koheda mandal in siddipet
'అర్హులైన అందరికీ టీకాలు అందిస్తున్నాం'

By

Published : Apr 20, 2021, 2:31 PM IST

కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో టీకాను ప్రజలకు మరింత సౌకర్యవంతంగా వేయడానికి రాష్ట్రంలోని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసింది. అర్హులైన వారికి వైద్యులు టీకాలు వేశారు.

జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం కోహెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, దూరంగా ఉన్న అందరికి టీకాలు వేస్తున్నామని మండల వైద్యాధికారి విజయరావు తెలిపారు. గ్రామంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగానే గ్రామస్తులకు సమాచారం అందించారని, దాదాపు బస్వాపూర్ గ్రామంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 220 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. సాయంత్రం వరకు క్యాంపు కొనసాగుతుందని వెల్లడించారు.

టీకా మొదటి డోసు తీసుకున్న వారు 6 నుంచి 8 వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని, కరోనా టీకా తీసుకున్నామని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, టీకా తీసుకున్న వారు కూడా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:కొవిడ్‌పై 'ఊబకాయ' భారం

ABOUT THE AUTHOR

...view details