సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల 10 రోజుల క్రితం ముంబయి నుంచి గ్రామానికి వచ్చిన ఒక కుటుంబానికి కరోనా లక్షణాలు కనిపించడం వల్ల సోమవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వారి నమూనాలు సేకరించి గాంధీ ఆసుపత్రికి పంపించగా అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరు భార్యాభర్తలు కావడం గమనార్హం.
సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.వెంటనే వెంకట్రావుపేట గ్రామాన్ని నిర్బంధంలో ఉంచారు.
భార్యభర్తలకు కరోనా పాజిటివ్... నిర్బంధంలో గ్రామం - భార్యభర్తలకు కరోనా పాజిటివ్
ముంబయి నుంచి స్వగ్రామానికి తరలివచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో ఇద్దరికి కరోనా వైరస్ సోకడం వల్ల అధికారులు ఆ గ్రామాన్ని నిర్భంధంలో ఉంచారు.

భార్యభర్తలకు కరోనా పాజిటివ్... నిర్బంధంలో గ్రామం