సిద్ధిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం ఇటీవలే బొంబాయి నుంచి వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన వారి శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే జిల్లా అధికారులు అప్రమత్త్మయ్యారు.
తొగుటలో పాజిటివ్ కేసు నమోదు! - సిద్దిపేట జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు మరిన్ని పెరగకుండా వెంటనే రంగంలోకి దిగి.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
తొగుట మండల కేంద్రంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గ్రామంలో పర్యటించి అధికారులను అడిగి పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా దరి చేరదని ధైర్యం చెప్పారు. డీఎంహెచ్వో మనోహర్, డీపీఓ సురేష్ బాబు, మండల వైద్యాధికారి వెంకటేశ్ తదితరులు మండల కేంద్రంలో పర్యటించారు.
ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు