హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు కరోనా పాజిటివ్
20:29 July 19
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు కరోనా పాజిటివ్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు కరోనా పాజిటివ్ వచ్చింది. తన సమీప బంధువుకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హన్మకొండలోని తన ఇంటికి పిలిపించారు. తానూ కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోగా, పరీక్షల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్కు పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే పీఎ తెలిపారు. సతీష్ కుమార్ వారం రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లి రావడంతోపాటు, గత గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఎమ్మెల్యేతోపాటు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అందరూ హోం క్వారంటైన్లోనే ఉన్నారు. ఆయన ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి, కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చింది. కానీ సతీష్ కుమార్కు పాజిటివ్ వచ్చిన విషయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించ లేదు. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులు మాత్రం కరోనా నిర్ధరణ అయినట్లు.. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత