తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పట్ల నిర్లక్ష్యం తగదు: మంత్రి హరీశ్​రావు - latest news on Minister Harish Rao

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్​లో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ మౌజమ్​లతో పాటు పలువురు నిరుపేదలకు మంత్రి హరీశ్​రావు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు.

Corona is not neglectful: Minister Harish Rao
కరోనా పట్ల నిర్లక్ష్యం తగదు: మంత్రి హరీశ్​రావు

By

Published : Apr 28, 2020, 5:24 PM IST

సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్​లో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ మౌజమ్​లతో పాటు పలువురు నిరుపేదలకు మంత్రి హరీశ్​రావు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. అందరూ బాగుండాలని దేవుళ్లను ప్రార్థించాలని సూచించారు.

కరోనా పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దన్న మంత్రి.. అత్యవసరమై బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఇంకొన్ని రోజులు లాక్​డౌన్​ పాటించి.. కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:'లాక్​డౌన్​ ముసుగులో యువతకు ఉగ్రమూకల ఎర'

ABOUT THE AUTHOR

...view details