తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: రవాణారంగ కార్మికులపై ఆర్థికభారం - coronavirus impact on goods transportation in Medak

లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సిద్ధిపేట పాలనాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా లాక్‌డౌన్‌ విధించిందని ఏఐటీయూసీ నేతలు గుర్తు చేశారు.

కరోనా ఎఫెక్ట్: రవాణారంగ కార్మికులపై ఆర్థికభారం
కరోనా ఎఫెక్ట్: రవాణారంగ కార్మికులపై ఆర్థికభారం

By

Published : May 12, 2020, 6:22 PM IST

సిద్దిపేటలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మచ్చ శ్రీనివాస్‌ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో పాలనాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా లాక్‌డౌన్‌ విధించిందని ఏఐటీయూసీ నేతలు గుర్తు చేశారు. కార్మికులంతా ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం స్పందించి ఒక్కో కార్మికుడికి రూ.7500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచడం వల్ల రవాణారంగ కార్మికులపై ఆర్థికభారం పడుతోందన్నారు.

ఇదీ చూడండి:టాప్​ టెన్​ న్యూస్​ @1pm

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details