సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కరోనా ఎఫెక్ట్: నేటి నుంచి ‘మల్లన్న’ ఆలయం మూసివేత - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని నేటి నుంచి నిరవధికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు దేవాలయ కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
కరోనా ఎఫెక్ట్: నేటి నుంచి ‘మల్లన్న’ ఆలయం మూసివేత
గడచిన మూడు రోజుల్లో ఆలయంలో పని చేస్తున్న అర్చకులు, పరిచారకులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు 10 మంది వరకు వైరస్ బారినపడినట్లు వెంకటేశ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పాలనాధికారి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఆలయంలో అంతర్గత పూజలు నిర్వహిస్తూ, భక్తులకు దర్శనాలు నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దర్శనం తేదీని తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి.. బజ్ విమెన్... మహిళల ఆర్థిక పాఠశాల