సిద్దిపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీ ఆదేశానుసారం మిరుదొడ్డి మండలంలో కరోనా ప్రచార రథం ద్వారా పలు గ్రామాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వైరస్‌పై ప్రజలకు దృశ్య రూపక అవగాహన కల్పించారు. రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, కరోనా నివారణకు తెలిపిన జాగ్రత్తలను, ఐసీఎం ఆర్ నియమ నిబంధనలను, మహమ్మారిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన సందేశాన్ని ప్రజలకు వివరణాత్మకంగా చిత్ర రూపకంగా చూపించారు.
పోలీసుల ఆధ్వర్యంలో కరోనాపై దృశ్యరూపక అవగాహన - సిద్దిపేటలో దృశ్యమాధ్యమంగా కరోనా అవగాహన
సిద్దిపేట సీపీ ఆదేశానుసారం మిరుదొడ్డి మండలంలో ప్రచార రథం ద్వారా దృశ్య రూపకంగా కరోనావైరస్ నివారణ, నియంత్రణపై పోలీసులు అవగాహన చేపట్టారు. ప్రముకులు తెలిపిన సందేశం, ఐసీఎంఆర్ నిబంధనలనలు ప్రజలకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా చూపించారు.
కరోనాపై దృశ్యరూపక అవగాహన
ఈ కార్యక్రమాన్ని మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ సమక్షంలో గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ కరోనా వైరస్ నివారణకు, నియంత్రణకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బయటకు వెళ్లినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని ఎస్సై సూచించారు.