ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు వరుణుడు కడగండ్లు మిగిల్చాడు. సిద్దిపేట మార్కెట్ యార్డుకు అమ్ముకునేందుకు తెచ్చిన మెుక్కజొన్నలు ఒక్కసారిగా వర్షం కురిసి తడిసి ముద్దయ్యాయి. కష్టపడి పండించి.. తీరా అమ్ముకునే సమయంలో ఆరుబయట ఆరబెట్టిన మెుక్కజొన్నలు టాప్కవర్స్ తెచ్చేలోపే తడిసిపోయాయి. అధికారులను అడిగితే చిరిగిపోయిన టాప్కవర్స్ ఇచ్చారని.. అవి వేసినా కవర్లు చిరిగి పంట తడిసిపోయిందని రైతులు వాపోయారు. వెంటనే తడిసిన మెుక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్లో తడిసిన మక్కలు.. అన్నదాతకు కడగండ్లు - మార్కెట్లో తడిసిన మక్కలు
కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని సిద్దిపేట మార్కెట్కు వచ్చిన అన్నదాతలను వరుణుడు ఇబ్బందులకు గురి చేశాడు. వారు తీసుకొచ్చిన మెుక్కజొన్నలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.
మార్కెట్లో తడిసిన మక్కలు.. అన్నదాతకు కడగండ్లు