తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇవ్వలేదంటూ సర్పంచ్​ భర్తపై దాడి.. - Latest news of Gajwel Constituency

double bedroom houses Controversy in Gajwel: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం రెండు పడకల ఇళ్లు నిర్మాణం. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పక ఇళ్లు ఇస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం.. కొందరు అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. సర్పంచ్​ భర్తపై దూషణకు దిగి ఆపై చేయి కూడా చేసుకున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో జరగడంతో ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

Controversy in distribution
Controversy in distribution

By

Published : Sep 20, 2022, 6:58 PM IST

double bedroom houses Controversy in Gajwel: ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం.. వందల కోట్లమేర వ్యయం.. ఎంతో మంది పేదల ఆశల సౌధం.. సొంతింటి కల నెరవేర్చే స్వప్నం అదే డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పథకం. చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నా క్షేత్ర స్థాయిలో అర్హులకు ఈ పథకం ద్వారా ఇళ్లు ఇవ్వడం లేదని పలుచోట్ల ఆశావాహులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ కేసీఆర్​ సొంత నియోజకవర్గం గజ్వేల్​లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. తమకు ఇళ్లు ఇవ్వలేదంటూ కొందరు ఏకంగా గ్రామ సర్పంచ్​ భర్తపై దాడి కూడా చేశారు.

ఇది జరిగింది:సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలో కొండపాక మండలం ఖమ్మంపల్లిలో 41 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్​రూం ఇళ్లను ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ఈరోజు పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిశాక కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారంటూ తమకి న్యాయం చేయాలని గ్రామసర్పంచ్ ముందు వాపోయారు. కొందరు మహిళలు ఒకానొక సమయంలో సహనం కోల్పోయి సర్పంచ్​ భర్త మల్లయ్యపై చేయిచేసుకున్నారు.

డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇవ్వలేదంటూ సర్పంచ్​ భర్తపై దాడి..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details