తెలంగాణ

telangana

ETV Bharat / state

'హుస్నాబాద్​ అంగడిలో వసూల్​ రాజాలు' - contractors collecting charges illegally at husnabad market in siddipet market

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగే వారసంతలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులు దుకాణదారుల నుంచి అంగడి రుసుము వసూలు చేస్తున్నారు.

contractors collecting charges illegally at husnabad market in siddipet market
హుస్నాబాద్​ అంగడిలో వసూల్​ రాజాలు

By

Published : Dec 28, 2019, 1:06 PM IST

హుస్నాబాద్​ అంగడిలో వసూల్​ రాజాలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగే వారసంతలో గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా అంగడి రుసుము వసూలు చేస్తున్నారు. స్థానిక మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట, రామవరం రోడ్డుకు ఇరువైపులా అంగడి విస్తరించి ఉంది. అంగడి జరిగే ఈ ప్రదేశంలోని దుకాణాలు, కూరగాయల వ్యాపారులు, పశువుల క్రయ విక్రయాలపై మాత్రమే రుసుములు వసూలు చేయాలి.

కానీ గుత్తేదారులు... నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని ప్రధాన రహదారి నాగారం రోడ్, సిద్దిపేట రోడ్, అక్కన్నపేట రోడ్లలో ఫుట్ పాత్ దుకాణదారుల నుంచి కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

తాము ఎందుకు రుసుములు చెల్లించాలని నిలదీస్తే సామాన్లు లాక్కుపోతున్నారని దుకాణదారులు వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోగా గుత్తేదారు పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details