తెలంగాణకి సాయం చేసింది కాంగ్రెస్ అని... అసత్యాలతో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే నీళ్లు - నిధులు - నియామకాలు వస్తాయని అన్నారని గుర్తు చేశారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారని... ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు భూమి లేదని మాటలు మారుస్తున్నారని విమర్శించారు.
అసత్యాలతో తెరాస అధికారంలోకి వచ్చింది: వీహెచ్ - సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎన్నికల ప్రచారం
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పాల్గొన్నారు. అసత్యాలతో తెరాస అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని నాడు కేసీఆర్ ఇచ్చిన మాటను గుర్తు చేశారు. విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్యాలతో తెరాస అధికారంలోకి వచ్చింది: వీహెచ్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చినా... నిధులు, నియామకాలు లేవని అన్నారు. ఇంటికో ఉద్యోగం, రెండు పడక గదుల ఇళ్లు రాలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్ అందించిందని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్‌రావు
TAGGED:
dubbaka election campaign