తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్​, ప్రియాంక గాంధీల అరెస్ట్​కు నిరసనగా హస్తం నేతల ధర్నా - రాహుల్​గాంధీ అరెస్ట్​కు వ్యతిరేకంగా కాంగ్రెస్​ ధర్నా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ అంబేడ్కర్​ చౌరస్తాలో కాంగ్రెస్​ నాయకులు ధర్నాకు దిగారు. యూపీలో హస్తం నేతలు రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్​ చేయడాన్ని నిరసిస్తూ భాజపాకు వ్యతిరేకంగా హస్తం నేతలు నినాదాలు చేస్తూ ప్రధాని చిత్రపటాన్ని దగ్ధం చేశారు.

congress protest in husnabad against rahul gandhi arrest at up
రాహుల్​, ప్రియాంక గాంధీల అరెస్ట్​కు నిరసనగా హస్తం నేతల ధర్నా

By

Published : Oct 2, 2020, 1:36 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ అంబేడ్కర్​ చౌరస్తాలో యూపీలో కాంగ్రెస్​ నాయకులు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్​ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​లో దళిత యువతిపై కొందరు అత్యాచారం చేసి.. ఆమె మరణానికి కారణమయ్యారు. యువతి మృతదేహాన్ని కనీసం కుటుంబానికి ఇవ్వకుండా పోలీసులే దహన సంస్కరణలు చేయడం దారుణమని డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి లింగమూర్తి తెలిపారు.

అయితే అత్యాచారం జరగలేదని..ఆ రాష్ట్ర ఐజీ నివేదిక ఇవ్వడం బాధాకరమని కాంగ్రెస్​ నేతలు అన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ దళితులపై అణచివేత ధోరణిని అవలంభిస్తోందని ఆరోపించారు. దేశంలో పేద వర్గాలకు ఒక న్యాయం ఉన్నత వర్గాల నిందితులకు మరో న్యాయం జరుగుతోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కేంద్రంలో భాజపా ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.

ఇదీ చదవండిః'హాథ్రస్'​పై హైడ్రామా- రాహుల్, ప్రియాంక అరెస్టు

ABOUT THE AUTHOR

...view details